‘వివక్షాపూరిత’ బడ్జెట్ అంటూ నలుగురు సిఎంల ఆగ్రహం
న్యూఢిల్లీ : కేంద్రబడ్జెట్ వివక్షపూరితమైనదంటూ.. ఈ నెల 27న జరగాల్సిన నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తామని నలుగురు ముఖ్యమంత్రులు ప్రకటించారు. వీరిలో తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ సిఎంలు సిద్ధరామయ్య, సుఖ్విందర్ సింగ్ సుఖు ఉన్నారు. ”ఈ బడ్జెట్ వివక్షాపూరితమైనది. ప్రమాదకరమైనది. ఇది పూర్తిగా సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అనుసరించాల్సిన ఫెడరలిజం , న్యాయమైన సూత్రాలకు భిన్నంగా ఉన్నది” అని నలుగురు సీఎంలు ప్రకటించారు.
