న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం నూతన విద్యా విధానం(ఎన్‌ఇపి)లో భాగంగా తమిళనాడులో త్రిభాషా విద్యా విధానం అమలును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం లోక్‌సభలో డిఎంకె పార్టీని తీవ్రంగా విమర్శించారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘డిఎంకెకి నిజాయితీ లేదు. తమిళనాడు విద్యార్థుల పట్ల నిబద్ధత లేదు. అది త్రిభాషా విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తూ… రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోంది. భాషా అడ్డంకులను పెంచడమే దానికున్న ఏకైక పని. డిఎంకె రాజకీయాలకు, దుశ్చర్యలకు పాల్పడుతుంది. అప్రజాస్వామికంగా.. అనాగరికంగా వ్యవహరిస్తోంది’ అని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.
అయితే… త్రిభాషా విధానాన్ని, డిలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ.. రాజ్యసభలో డిఎంకె నేతలు నినాదాలు చేస్తూ… సభనుంచి వాకౌట్ చేశారు.
