న్యూఢిల్లీ : ఉన్నావో అత్యాచారం కేసులో దోషి, మాజీ బిజెపి నేత కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం తాత్కాలిక బెయిల్ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మంగళవారం కుల్దీప్‌కు కంటి శుక్లం శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారని, ఒక్కరోజు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తున్నట్లు జస్టిస్ యశ్వంత్ వర్మ, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఫిబ్రవరి 5న జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
