Result: మహారాష్ట్రలో వందకు పైగా స్థానాల్లో గెలిచిన ఎన్ డి ఎ కూటమి

పార్టీఅధిక్యం గెలుపు
మహాయుతి119112
మహా వికాస్2327
ఇతరులు34

 

  • మహారాష్ట్రలో 112 స్థానాల్లో మహాయతి కూటమి గెలుపొందింది. మరో 119 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహా వికాస్ అఘాడీ కూటమి 27 స్థానాల్లో గెలుపొందింది. మరో 20కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు కూడా గెలుపు దిశలోనే ఉన్నారు. 
  • భారత ఎన్నికల సంఘం వివరాల ప్రకారం.. మహారాష్ట్రలో బిజెపి 12 సీట్లు గెలిచింది. 120 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. శివసేన (ఎస్ హెచ్ ఎస్) : 8 స్థానాల్లో గెలిచింది. 46 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అజిత్ పవార్ (ఎన్ సి పి) 8 స్థానాల్లో గెలిచింది. 32 స్థానాల్లో ముందంజలో ఉంది.
  • కాంగ్రెస్ 18 స్థానాల్లో లీడ్ లో ఉంది. శివసేన (యుబిటి) : 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్ సిపి (శరద్ పవార్) : 2 స్థానాల్లో గెలిచింది. మరో 10 స్థానాల్లో ముందంజలో ఉంది.
  • ఎఐయంఐయం : 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.  సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) : 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతర పార్టీలు కూడా ఆధిక్యంలో ఉన్నాయి.
  • మహారాష్ట్రలో 11.50 గంటల లెక్కింపు సమయానికి బిజెపి : 124, ఏక్ నాథ్ షిండే శివసేన : 56, అజిత్ఎ పవార్  ఎన్ సిపి : 36, కాంగ్రెస్ : 20, శివసేన (యుబిటి) : 19, ఎన్ సిపి 15, ఎఐయంఐయం 2, సమాజ్ వాది పార్టీ 2, జన్ సుర్జయా శక్తి : 2, రాష్టీయ యువ స్వాభిమాన్ పార్టీ : 1, ఆజాద్ సజమాజ్ పార్టీ : 1, స్వతంత్ర భారత పార్టీ : 1, ఇండియన్ సెక్యులర్ లార్జెస్ట్ అసెంబ్లీ ఆఫ్ మహారాష్ట్ర : 1, కమ్యూనిస్టు పార్టీ ఆఫ ఇండియా (సిపిఐ ఎం) : 1, పిడబ్ల్యపిఐ : 1, ఆర్ ఎస్ వి ఎ : 1, స్వతంత్రులు : 5 ఆధిక్యంలో ఉన్నాయని ఇసి వెల్లడించింది. 
  • మహారాష్ట్రలో 10.30 గంటల లెక్కింపు సమయానికి బిజెపి 122 సీట్లు, ేక్నాథ్షిండే  శివసేన 58, అజిత్ పవార్ ఎన్ సిపి 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి అని  భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక కాంగ్రెస్ 20, శివసేన (యుబిటి) 19, ఎన్ సిపి (శరద్ పవార్) 10 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయని ఇసి వెల్లడించింది. 
  • నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ 2,246 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
    మొదటి రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి దేవేంద్ర ఫడ్నవిస్ నాగ్‌పూర్ సౌత్-వెస్ట్ నుండి 2,246 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
  • బారామతి అసెంబ్లీ స్థానంలో అజిత్ పవార్ 3,759 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
    మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ బారామతి అసెంబ్లీ స్థానంలో తొలి రౌండ్ ముగిసే సమయానికి 3,759 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
  • కోప్రి-పచ్‌పఖాడి అసెంబ్లీ స్థానం నుంచి మొదటి రౌండ్ ముగిసే సమయానికి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే 4,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

మహారాష్ట్ర : మహారాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 288 స్థానాలకు ఓటింగ్ ప్రారంభమైంది. మొదటి పోస్టల్ బ్యాలెట్ లో ఓట్ల లెక్కింపును ఎన్నికల సిబ్బంది ప్రారంభించారు. ఆ తర్వాత ఈవిఎంలలో ఓట్లను లెక్కించనున్నారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 145. అధికార మహాయుతి కూటమి మరియు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. దీంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. 2019లో.. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 105 సీట్లు, దాని మిత్రపక్షం శివసేన 56 సీట్లు గెలుచుకున్నాయి. ఎన్సీపీ 54 సీట్లు, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకున్నాయి.

 

 

➡️