మదురైలో కదంతొక్కిన పేదలు

  • ఇళ్లు, భూములకు పట్టాలివ్వాలని వేలాదిమంది ప్రదర్శన

మధురై : వేలాదిమంది పేదలు మదురైలో కదంతొక్కారు. ఇళ్లకు, భూములకు పట్టాలివ్వాలని డిమాండ్‌ చేస్తూ వేలాదిమంది పేదలు సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంట్‌ సభ్యులు, సిపిఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ఎస్‌.వెంకటేశన్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.కన్నన్‌, మధురై పట్టణ, గ్రామీణ జిల్లాల కార్యదర్శులు ఎం.గణేశన్‌, కె.రాజేంద్రన్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌.విజయరాజన్‌, ఎస్‌కె పొన్నితారు తదితరులు నాయకత్వం వహించారు. ప్రదర్శన అనంతరం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు మెమొరాండం సమర్పించారు.

➡️