Supreme Court : ఎస్‌ఎన్‌జెపిసి సిఫారసుల అమలుకు సమ్మతించిన రాష్ట్రాలు, యుటిలు

న్యూఢిల్లీ :   రెండవ జాతీయ న్యాయపరమైన వేతన సంఘం (ఎస్‌ఎన్‌జెపిసి) సిఫారసుల అమలుకు సమ్మతిస్తున్నట్లు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. న్యాయ అధికారులకు పెన్షన్‌ బకాయిలు, పదవీవిరమణ ప్రయోజనాలు, ఇతర చెల్లింపులపై ఎస్‌ఎన్‌జెపిసి సిఫారసులను అమలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన సంగతి తెలిసిందే.

మధ్యప్రదేశ్‌, తమిళనాడు, మేఘాలయ, హిమాచల్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, ఒడిశా, కేరళ మరియు ఢిల్లీ వంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్‌ఎన్‌జెపిసి సిఫారసుల అమలుకు సమ్మతిస్తున్నట్లు అఫిడవిట్‌లు సమర్పించడంతో .. వాటిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు వాటిపై విచారణను నిలిపివేయాలని ఆదేశించింది.

అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించినందున ఇకపై కోరుకు హాజరు కానవసరంలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి. పార్థివాలా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శులు ఆదేశించింది.

➡️