Varun Gandhi : వరుణ్‌గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా?!

Mar 20,2024 15:34 #BJP, #varun gandhi

లక్నో : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేత వరుణ్‌గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. స్వంత పార్టీపైనే విమర్శలు చేయడం వల్ల ఈసారి జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి తనకు టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బిజెపి టికెట్‌ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం వరుణ్‌గాంధీ పిలిభిత్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా ఈ నియోజకవర్గం నుంచే వరుణ్‌ గాంధీ పోటీకి దిగే అవకాశం ఉంది. మరోవైపు సమాజ్‌వాద్‌ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ వరుణ్‌గాంధీకి ఎంపి టికెట్‌ ఇచ్చే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. గతంలో వరుణ్‌గాంధీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ స్కీమ్‌పై పలు విమర్శలు గుప్పించారు. అలాగే యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వ పనితీరుపై కూడా తన అసమ్మతి గళాన్ని వినిపించారు.

➡️