న్యూఢిల్లీ : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ బుధవారం ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్య బృందం ప్రకటన విడుదల చేసింది. ఆసుపత్రిలో జాయిన్ అయిన తర్వాత వైద్యుల సంరక్షణలో ఆయన పూర్తిగా కోలుకున్నారని, అయితే మరికొన్ని రోజులు ఆయన తగినంత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు ఈ ప్రకటన పేర్కొంది.
కాగా, జగదీప్ ధన్‌కర్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ మార్చి 9వ తేదీన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.