ఎయిమ్స్‌లో ఉపరాష్ట్రపతి

Mar 10,2025 07:27 #Vice President

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి జగదీప్‌ దన్కర్‌ ఎయిమ్స్‌లో చేరారు. ఉపరాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే ప్రధాని మోడీ ఆస్పత్రికి వచ్చి.. వైద్యులను అడిగి తెలుసుకున్నట్టు మోడీ స్వయంగా ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. దన్కర్‌ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆదివారం తెల్లవారు జామున 2గంటల సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో జగదీప్‌ ధన్‌ఖడ్‌ను ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ను ఎయిమ్స్‌లోని క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (సిసియు)లో ఉంచి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. అంతకుముందు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా ఆస్పత్రికి వెళ్లి ఉపరాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

➡️