ఢిల్లీ : ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ తరలించారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో చికిత్స జరుగుతోంది. ధంఖర్ ఆరోగ్యం స్థిరంగా ఉందని.. వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోందని ఏయిమ్స్ వైద్యులు తెలిపారు.
