ఆటోడ్రైవర్‌కు కీలక పదవి ఇచ్చిన విజయ్

Feb 5,2025 17:58 #Auto driver, #tamilnadu, #vijay

చెన్నై : తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ నటుడు విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం పార్టీలో ఆటో డ్రైవర్‌కు కీలక పదవి దక్కింది. పార్టీ కోయంబత్తూరు సబర్బన్‌ ఈస్ట్‌ జిల్లా కార్యదర్శిగా బాబు అనే ఆటో డ్రైవర్‌ను నియమించారు. విజరుకు వీరాభిమాని అయిన బాబుకు పార్టీలో కీలకమైన పదవి ఇచ్చినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న బాబు స్నేహితులు, సన్నిహితులు, పార్టీ కార్యకర్తలు తనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్‌ బాబు మాట్లాడుతూ.. ‘నేను విజయ్ కి అభిమానిని. విజయ్ అభిమాన సంఘమైన విజరు మక్కల్‌ ఇయక్కమ్‌లో క్రియాశీల కార్యకర్తగా పనిచేశాను. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవాడేని. విజయ్ పార్టీ ప్రారంభించిన తర్వాత సాధారణ కార్యకర్తగా కొనసాగుతున్నాను. ఈ నేపథ్యంలో మా నేత విజయ్ నాకు జిల్లా శాఖ కార్యదర్శి పదవినివ్వడం ఎంతో సంతోషంగా ఉంది’ అని ఆయన అన్నారు.

➡️