Viral Video: కుప్పకూలిన డ్రైవర్… స్టీరింగ్ పట్టిన కండక్టర్

ఇంటర్నెట్ : బెంగళూరులో బస్సు ప్రమాదం తప్పింది. బస్సు కండక్టర్ సమయస్పూర్తితో వ్యవరించడంతో పెను ప్రమాదం తప్పింది. బుధవారం వేగంగా వెళ్తున్న బస్సులోని డ్రైవర్ కిరణ్ కుమార్‌ గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న కండక్టర్ ఓబలేష్ గమనించి వెంటనే డ్రైవర్ సీటులో కూర్చుకొని బస్సును రోడ్డుపైనే ఆపారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు బస్సులోని సీసీటీవీ రికార్డ్ అయ్యాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే  చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. డ్రైవర్ మృతికి ఆర్టీసి సంస్థ సంతాపం తెలిపింది. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

 

➡️