కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం అగ్రనేత జ్యోతిబసు 111వ జయంతి సందర్భంగా ఆయనకు దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించారు. పశ్చిమ బెంగాల్‌లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కోల్‌కతాలోని ప్రమోద్‌దాస్ గుప్తా భవన్‌లో మంగళవారం పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో లెఫ్ట్ ఫ్రంట్ ఛైర్మన్ బిమన్‌బసు, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి ఎమ్‌డి సలీం, పొలిట్‌బ్యూరో సభ్యులు రామచంద్రడోమ్ తదితరులు పాల్గొన్నారు.
