బాబు, నితీష్‌ మద్దతుతోనే ‘వక్ఫ్‌’ సవరణ : మంత్రి కిరణ్ రిజిజు

శ్రీనగర్‌ : టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, జెడియు అధినేత బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మద్దతుతోనే వక్ఫ్‌ సవరణ బిల్లును ప్రతిపాదించామని పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. శ్రీనగర్‌లో జరిగిన ‘బడ్జెట్‌ పె చర్చ’ అనే కార్యక్రమంలో రిజిజు మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ సవరణలు వక్ఫ్‌ ఆస్తులను లాక్కోవడానికి కాదని, సమర్థవంతమైన నిర్వహణ కోసమని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు, నితీష్‌ ఇద్దరూ ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు.

➡️