శ్రీనగర్ : ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. ఈ విషయం సుప్రీంకోర్టులో ఉన్నందున దీనిపై చర్చకు అనుమతించకూడదని స్పీకర్ మంచి నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత మనం దీని గురించి మాట్లాడవచ్చు. ఇక్కడ ప్రతిపక్షం వ్యతిరేకించడానికి మాత్రమే విమర్శిస్తోంది. ఇది ఆరోగ్యకరమైన విమర్శ కాదు’ అని ఆయన అన్నారు.
