పార్లమెంట్‌ ఎన్నికలకు ముందే పౌరసత్వ చట్టం అమలులోకి తీసుకొస్తాం : అమిత్‌ షా

Feb 11,2024 10:45 #Amit Shah, #BJP, #cca

ఢిల్లీ : పార్లమెంట్‌ ఎన్నికలకు ముందే పౌరసత్వ చట్టం అమలులోకి తీసుకొస్తామని కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. శనివారం ఢిల్లీలో ఎకనామిక్స్‌ టైమ్‌ నిర్వహించిన సదస్సులో అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ముస్లిం సోదరుల్ని సీఏఏకి వ్యతిరేకంగా తప్పుదోవపట్టిస్తున్నారని.. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లో హింసను ఎదుర్కొని భారత్‌కు వచ్చినవారికి పౌరసత్వం ఇవ్వడమే సీఏఏ ఉద్దేశమని తెలిపారు. ఏ ఒక్కరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడం కోసం కాదని అని స్పష్టం చేశారు. సీఏఏ అమలుకు ముందు దానికి సంబంధించిన నిబంధనలను జారీ చేస్తామన్నారు.

➡️