junior doctors : డిమాండ్లు నెరవేర్చకపోతే విధుల్లోకి వెళ్లం

  • కొల్‌కతా జూనియర్‌ డాక్టర్లు

కొల్‌కతా : మమతాబెనర్జీ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే మళ్లీ విధుల్లోకి వెళ్లమని జూనియర్‌ డాక్టర్లు స్పష్టం చేశారు. ఈమేరకు మంగళవారం వైద్యులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటివరకూ దీదీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు రాకపోవడంతో మంగళవారం నుంచి జూనియర్‌ డాక్టర్లు మరోసారి నిరసనలకు దిగారు. ఈరోజు ఆందోళనల్లో పాల్గొన్న జూనియర్‌ వైద్యుడు అనికేత్‌ మహతో మీడియాతో మాట్లాడుతూ.. ‘వైద్యుల భద్రత కోసం మేము కోరుతున్న డిమాండ్లను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రావడం లేదు. నేటికి 52 రోజులు అవుతున్నా ఇంకా మాపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మమతాబెనర్జీ మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ప్రస్తుతం మేమున్న పరిస్థితుల్లో విధులకు గైర్హాజరవడం మినహా మాకు వేరే మార్గం లేదు. అందుకే నేటి నుంచి మళ్లీ నిరసనల్లోకి దిగాం’ అని అన్నారు. కాగా, ఆగస్టు 9వ తేదీన కోల్‌కతాలోని ఆర్‌జికర్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిని దారుణంగా హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే.

➡️