మంకీపాక్స్‌ వ్యాక్సిన్‌ డబ్ల్యుహెచ్‌ఓ ఆమోదం

Sep 13,2024 23:39 #Monkeypox, #vaccine, #WHO approval

జెనీవా : ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న మంకీపాక్స్‌ వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ ఎంవిఎ-బిఎన్‌ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను అత్యవసరమైన కమ్యూనిటీలకు ఇవ్వనున్నారు. తమ ప్రీ క్వాలిఫికేషన్‌ జాబితాలో ఈ వ్యాక్సిన్‌ను చేర్చినట్లు డబ్ల్యుహెచ్‌ఓ శుక్రవారం ప్రకటించింది. వ్యాక్సిన్‌ తయారీదారు బవేరియన్‌ నార్డిక్‌ అందచేసిన సమాచారం, యురోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ ఇచ్చిన సమీక్ష ప్రాతిపదికన ప్రీ క్వాలిఫికేషన్‌ ప్రక్రియ చేపడతారు. వ్యాక్సిన్లను వేగంగా సమీకరించడం, పంపిణీ చేయడానికి ఉద్దేశించిందే ఈ ప్రీ క్వాలిఫికేషన్‌ ప్రక్రియ. క్రమంగా విస్తరిస్తున్న మంకీపాక్స్‌ వైరస్‌పై పోరాటంలో ఇది కీలక చర్య అని డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అదనామ్‌ గెబ్రెయెసెస్‌ వ్యాఖ్యానించారు. అవసరమున్న అందరికీ సమానంగా పంపిణీ అయ్యేలా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచాల్సి వుందని ఆయన పిలుపునిచ్చారు. 18ఏళ్ళు పైబడిన వారికి నాలుగు వారాల తేడాలో రెండు డోసులుగా ఈ వ్యాక్సిన్‌ను అందచేస్తారు

➡️