రమేష్‌ బిదురిని బిజెపి ఎన్నికల నుంచి తప్పించనుందా?!

Jan 8,2025 12:30 #BJP leader, #ramesh bidhuri

న్యూఢిల్లీ : ఢిల్లీ సిఎం అతిషి, కాంగ్రెస్‌ ఎంపి ప్రియాంక గాంధీ వాద్రాపై బిజెపి నేత రమేష్‌ బిదురి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో బిదూరిపై బిజెపి క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి బిదురినీ ఎన్నికల నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పోటీ చేసినా ఢిల్లీ సిఎం అతిషి పోటీ చేస్తున్న కల్కాజీ నియోజకవర్గం నుంచి కాకుండా.. వేరే నియోజకవర్గంలో పోటీకి నిలబెట్టేందుకు ఆ పార్టీ యోచిస్తోందని సమాచారం. అతిషిపై పోటీగా మహిళా అభ్యర్థిని పోటీగా నిలిపేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని.. ఈ మేరకు ఇప్పటికే ప్రకటించిన రమేష్‌ బిదూరితోనూ ఆ పార్టీ సీనియర్‌ నేతలు చర్చలు జరుపుతున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాగా, గుజ్జర్‌ సామాజికవర్గపు బలమైన నేతగా రమేష్‌ బిదురికి పేరుంది. గతంలో ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పనిచేశారు.

➡️