ఎనర్జీ డ్రింక్స్‌ను పంజాబ్‌ నిషేధించనుందా?

Mar 26,2025 13:27 #energy drinks, #Punjab

పంజాబ్‌ : 18 ఏళ్ల లోపు చిన్నారులు తాగే ఎనర్జీ డ్రింక్స్‌ని నిషేధించడానికి పంజాబ్‌ ప్రభుత్వం సిద్ధమైంది. చిన్నారులకు అందుబాటులో ఉండే పాఠశాల క్యాంటీన్లలోగానీ, పాఠశాల పరిసర ప్రాంతాల్లోని దుకాణాల్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ని నిషేధించేందుకు పంజాబ్‌ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మాదక ద్రవ్య వ్యసనం పాఠశాల స్థాయి నుండే ప్రారంభమవుతుందని.. దానిని అరికట్టేందుకే చర్యలు తీసుకునేందుకే ఎనర్జీ డ్రింక్స్‌పై నిషేధం విధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పంజాబ్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖామంత్రి బల్బీర్‌ సింగ్‌ తెలిపారు. ఇటీవల తాను ఓ పాఠశాలను సందర్శించిన తర్వాత ఎనర్జీ డ్రింక్స్‌, స్ట్రాబెర్రీ క్విక్‌లకు బానిసలవుతున్నట్లు తెలుసుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ నిషేధంపై కేబినెట్‌ కమిటీ కూడా చర్చించిందని ఆయన తెలిపారు.
ఈ ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్‌ మోతాదు ఎక్కువగా ఉంటుంది. వీటిని చిన్నారులు తాగితే వారు వ్యసనానికి గురయ్యే అవకాశం ఉంది. వీటి నిషేధంపై చట్టబద్దమైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

➡️