Winter Session: లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల మూడోరోజైన బుధవారం లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. అదానీ కుంభకోణంపై పార్లమెంటులో చర్చ జరపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్‌ ఎంపిలు మాణికం ఠాగూర్‌, రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా, మనీష్‌ తివారీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు.

వయనాడ్‌ ఘటన బాధితులకు సహాయం అందించడంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీల నేతృత్వంలో పార్లమెంటులో, వెలుపల ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్‌ ప్రకటించింది.

ఢిల్లీ నేరాలు, మణిపూర్‌ సంక్షోభం, సంభాల్‌ హింసాకాండ, అదానీ నేరారోపణ వంటి పలు అంశాపై 18 వాయిదా తీర్మానాల నోటీసులు స్పీకర్‌కు అందించారు. అయితే స్పీకర్‌ వాటన్నింటినీ తిరస్కరించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేపట్టారు. స్పీకర్‌ లోక్‌సభను 12.00 గంటలకు వాయిదా వేశారు.

➡️