వామపక్ష ఐక్యతకు కృషి

Apr 15,2025 00:09 #Ajay Bhavan, #CPI, #cpm leaders, #ma baby
  • సిపిఎం, సిపిఐ నేతలు
  • అజయ్ భవన్‌కు వెళ్లిన ఎంఎ బేబి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వామపక్ష ఐక్యతను బలోపేతం చేయాలని, దీనికోసం పట్టుదలగా కృషి చేయాలని సిపిఎం, సిపిఐ నేతలు నిర్ణయించారు. సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఎంఎ బేబి , సిపిఐ ప్రధాన కార్యాలయం (అజయ్ భవన్‌)కు సోమవారం వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు నీలోత్పల్‌బసు, అశోక్‌ధావలే, ఆర్‌ అరుణ్‌కుమార్‌ తదితరులతో కలిసి ఎంఎ బేబి సిపిఐ కార్యాలయానికి వెళ్లారు. సిపిఐ కార్యాలయం వద్ద సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజాతో పాటు, సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అనీరాజా, పల్లబ్‌ సేన్‌ గుప్తా, కష్ణా ఝా తదితరులు సిపిఎం బృందానికి స్వాగతం పలికారు.
అనంతరం ఇరు పార్టీల నేతలు సమావేశమైనారు. వివిధ అంశాలపై ప్రాథమికంగా చర్చించారు. ఈ సమావేశంలో సిపిఐకు చెందిన పలు ప్రజా సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు.

➡️