న్యూఢిల్లీ : సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమంగానే వున్నా నిలకడగా వుందని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయనకు ఐసియులో వెంటిలేటర్ సపోర్ట్‌తో చికిత్స చేస్తున్నారు. నిష్ణాతులైన వైద్య బృందం ఆయన పరిస్థితిని 24 గంటలూ పర్యవేక్షిస్తున్నది. ఏచూరి ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌తో ఆగస్టు 19న ఎయిమ్స్‌లో చేరారు.
