బెంగళూరు : పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు హైకోర్టు స్వల్ప ఊరట కల్పించింది. ఈ కేసులో మార్చి 15న కేసు విచారణకు హాజరుకావాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు యడ్యూరప్పను ఆదేశించింది. అయితే తాజాగా కర్ణాటక హైకోర్టు ఆ కేసుకు సంబంధించిన సమన్లను నిలిపివేసింది.
కాగా, మైనర్ బాలికపై యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలొచ్చిన సంగతి తెలిసిందే. మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న 17 ఏళ్ల బాలికపై యడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది.
