రీల్స్‌ చేస్తూ లోయలో పడి యువతి మృతి..

Jul 18,2024 10:25 #died, #doing reels., #young woman

ముంబై: ముంబైకి చెందిన ట్రావెల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ అన్వీ కామ్‌దార్‌(26) స్నేహితులతో రారుగడలోని కుంభే జలపాతానికి వెళ్లారు. అక్కడ రీల్స్‌ చేసేందుకు లోయ అంచున నిలబడగా కాలు జారి 300 అడుగుల లోయలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసు, ఫైర్‌ సిబ్బంది 6 గంటలు కష్టపడి అన్వీని కాపాడారు. కానీ తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్చిన కాసేపటికే ఆమె మరణించారు. అన్వీకి సోషల్‌ మీడియాలో 2లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

➡️