హర్యానాలో ఆప్‌కు ‘జీరో’

Oct 9,2024 00:26 #'Zero' for AAP, #Haryana
  • 1.79 శాతం ఓట్లు వచ్చినా ఓటమే
  • జమ్మూ కాశ్మీర్‌లో 0.52 శాతం ఓట్లు
  • దోడా సీటు కైవసం
  •  అసెంబ్లీలో అడుగుపెట్టనున్న మెహ్రాజ్‌ మాలిక్‌

చండీగఢ్‌: జమ్మూకాశ్మీర్‌, హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టిన ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్‌) హర్యానాలో 1.79 శాతం ఓట్లు వచ్చినా ‘జీరో’కే పరిమితమైంది. ఆ పార్టీ నుంచి ఒక్కరు కూడా గెలవలేకపోయారు. కానీ జమ్మూ కాశ్మీర్‌లో 0.52 ఓట్లు సాధించి దోడా స్థానానికి పోటీ చేసిన ఆప్‌ అభ్యర్థి మెహ్రాజ్‌ మాలిక్‌ విజయం సాధించారు. ఆమెకు మొత్తం 23,228 ఓట్లు వచ్చాయి. దీంతో మెహ్రాజ్‌ మాలిక్‌ అసెంబ్లీలో అడుగుపెట్టబోనున్నారు.
ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ హర్యానా ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారు. అయినా అక్కడి ఓటర్లు విశ్వసించకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఓట్ల శాతం పెరిగినా అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఆప్‌నకు మొత్తం 1.79 శాతం ఓట్లు వచ్చాయి. అయితే జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఊరటనిచ్చాయి. తొలిసారిగా ఈ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాష్ట్ర అసెంబ్లీలో కూర్చోనున్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. హర్యానాతో పోలిస్తే జమ్మూ కాశ్మీర్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓటరు శాతం తక్కువగా ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీకి 0.52 శాతం ఓట్లు వచ్చాయి.

➡️