ఇంట్లో పేలిన సిలిండర్‌, ఫ్రిజ్‌.. ఎగిసిపడ్డ అగ్నికీలలు

Feb 11,2024 16:10 #Fire Accident, #rangareddy

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెంట్‌ మండలం అనాజ్‌పూర్‌లోని ఓ ఇంట్లో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. అనాజ్‌పూర్‌లోని ఓ భవనంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఆ తర్వాత మంటలు చెలరేగాయి. అయితే, ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌ సైతం పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో వృద్ధురాలు ఉన్నది. ఆ వఅద్ధురాలు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. అయితే, ప్రమాదానికి సంబంధించి కారణాలు తెలియరాలేదు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లనే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

➡️