కానిస్టేబుల్‌ పై మందుబాబు దాడి

Feb 13,2024 14:40 #attack, #drinker, #trafic conistable

హైదరాబాద్‌: మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్‌ చల్‌ చేశాడు. రాంగ్‌ రూట్‌లో వెళ్లద్దని సూచించిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నాగరాజుపై దాడికి పాల్పడ్డాడు. గొంతు పట్టుకుని అసభ్య పదజాలంతో దూషించాడు. తర్వాత నిందితుడికి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ చేయగా మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. దాడి చేసిన వ్యక్తి రోహిత్‌ (25)గా గుర్తించారు. అంబర్‌ పోలీసు స్టేషన్‌ లో కానిస్టేబుల్‌ ఘటనపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్‌ పై మద్యం సేవించిన వ్యక్తి దాడి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️