కాసేపట్లో విశాఖపట్నం బయల్దేరనున్న సీఎం వైఎస్‌ జగన్‌

Feb 13,2024 15:30 #ap cm jagan, #paryatana, #vsakha

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. విశాఖ సాగర తీరంలో ముగింపు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. ముగింపు వేడుకల్లో పాల్గని విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.ఇందుకోసం సీఎం జగన్‌ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. పీఎం పాలెంలోని వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియానికి వెళ్లి క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి చేరుకుంటారు.

➡️