చంద్రబాబు ప్లేట్‌ ఫిరాయింపు : మాజీ మంత్రి పేర్ని నాని

Apr 1,2024 23:42 #chandrababu, #coments, #perni nani, #TDP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు వల్ల టిడిపి నష్ట నివారణ కోసం ప్లేట్‌ ఫిరాయించి మాట్లాడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. పెన్షన్లు ఇంటింటికీ పంపిణీ చేయాలని మళ్లీ చంద్రబాబు ప్రకటనలు చేయడం దివాళాకోరుతనం కాదా? అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వలంటీరు వ్యవస్థపై తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషన్‌ వద్ద చంద్రబాబు పైరవీలు చేసి వలంటీర్లను సేవలకు దూరం చేశారని విమర్శించారు. ఈ కుట్రలను ప్రజలు ఎక్కడికక్కడే ప్రశ్నిస్తుండటంతో దిక్కుతోచక పెన్షన్లు ఇవ్వాలని వినతిపత్రాలు ఇస్తున్నారని విమర్శించారు. జనసేన, బిజెపికి పొత్తులో భాగంగా ఇచ్చిన సీట్లలోనూ మొత్తం టిడిపి అభ్యర్థులే వున్నారని అన్నారు. జనసేన కోసం జెండా మోసిన కార్యకర్తలకు ఎంతమందికి టికెట్లు ఇప్పించుకున్నారో పవన్‌కల్యాణ్‌ చెప్పాలన్నారు.

➡️