జూబ్లీహిల్స్‌ హనీట్రాప్‌ కేసులో హిమాంబి అరెస్ట్‌

Feb 11,2024 16:16 #crime

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ హనీట్రాప్‌ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. స్థిరాస్తి వ్యాపారి పుట్టరాము అలియాస్‌ సింగోటం రామన్న (36) హత్యకేసులో.. నిందితురాలిగా ఉన్న హిమామ్‌ బీ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఆమెపై ఇప్పటికే వివిధ పోలీసు స్టేషన్లలో ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు గుర్తించారు. 2017, 2018లో ఇద్దరు వేర్వేరు అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న హిమామ్‌ బీని పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 2020లోనూ జూబ్లీహిల్స్‌ వెంకటగిరిలో వ్యభిచారం నడిపిస్తోందని అదుపులోకి తీసుకున్నారు. 2017లో మేడిపల్లికి చెందిన విష్ణుకాంత్‌ అనే వ్యక్తిని బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.3 లక్షలు నగదును కాజేసినట్లు కేసు నమోదైంది. 2019లో తన కుమార్తెను రాజు అనే వ్యక్తి కిడ్నాప్‌ చేశాడంటూ హిమామ్‌ బీ తప్పుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసుల దఅష్టికి వచ్చింది. ఇలా హిమామ్‌ బీ పలువురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు.

➡️