టీటీడీకి ఒక్క రోజులో వచ్చిన ఆదాయం ఎంతంటే

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 20 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. సోమవారం 69,314 మంది యాత్రికులు దర్శించుకోగా 25,165 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.48 ఆదాయం వచ్చిందని తెలిపారు.తిరుమలలో ఈనెల 24న కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. తీర్థముక్కోటి రోజున యాత్రికులు తీర్థ స్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు.

➡️