టీడీపీ- జనసేన పార్టీలో సీట్ల ప్రకటనలో డొల్లతనం : మంత్రి చెల్లుబోయిన

రాజమండ్రి: టీడీపీ- జనసేన పార్టీలో సీట్ల ప్రకటన తర్వాత డొల్లతనం బయటపడిందని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. ఈ సందర్బంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిక్కెట్ల ప్రకటనతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ని చంద్రబాబు తీవ్రంగా అవమానపరిచారని, పవన్‌ను అవమనించడమంటే సామాజిక వర్గాన్ని తీవ్రంగా అవమానించినట్లేనని అన్నారు. కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలని అత్యాశతో చంద్రబాబు ఘోరంగా పవన్‌ కళ్యాణ్‌ ను అవమాన పరుస్తున్నారని ఆరోపించారు.చంద్రబాబు 95 సీట్లు ప్రకటించుకుంటే పవన్‌ ఐదు సీట్లు కూడా ప్రకటించుకోలేకపోయారని అన్నారు. ఇప్పటికే టీడీపీకి రాజ్యసభలో సున్న, రేపు పార్లమెంట్లోనూ అసెంబ్లీలో కూడా సున్నాయే అంటూ ఆరోపించారు.

➡️