తిరుమలలో పెరిగిన యాత్రికుల రద్దీ..

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవుదినం కావడంతో ఆదివారం తిరుమలకు యాత్రికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు నిండిపోయి మంగళం బావి కాటేజ్‌ వరకు యాత్రికులు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.శనివారం స్వామివారిని 72,175 మంది యాత్రికులు దర్శించుకోగా 29,543 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.74 కోట్లు వచ్చిందని తెలిపారు.

➡️