తెలంగాణలో భారీగా ఎంపీడీవోల బదిలీ

Feb 11,2024 15:06 #mpdo, #Transfer

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల బదిలీలు కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని 395 మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. సొంత జిల్లాలో పని చేస్తున్న వారితోపాటు మూడేళ్లకుపైగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని డిసెంబరులో ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈసీ మార్గదర్శకాల మేరకు వివిధ శాఖలు బదిలీలు చేపట్టాయి. రెవెన్యూ శాఖలో 132 మంది తహశీల్దార్లను, 32 మంది డిప్యూటీ కలెక్టర్లను శనివారం బదిలీ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ భారీ బదిలీలు జరగనున్నట్లు తెలుస్తోంది.

➡️