తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు

Nov 29,2023 16:43 #heavy rains, #Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. మంగళవారం నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో అత్యధికంగా 5.1సెం.మీ.లు, నిజామాబాద్‌ నార్త్‌లో 4.35సెం.మీ.లు, నిజామాబాద్‌లో 3.93సెం.మీ.లు, నిజాంపేటలో 3.58సెం.మీ.లు, కల్దుర్తి, గోపన్‌పల్లిలలో 3.45సెం.మీ.లు, చిన్నమావంధిలో 3.15సెం.మీ.ల వర్షాపాతం నమోదైంది.

➡️