నరసరావుపేటలో భారీగా నగదు, బంగారం స్వాధీనం

Feb 13,2024 16:45 #Gold, #palanadu

ప్రజాశక్తి- నరసరావుపేట(పల్నాడు) : నరసరావుపేటలో మంగళవారం భారీగా నగదు, బంగారం పట్టుబడింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఇద్దరు వ్యక్తులు రైలులో ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ. 11 లక్షల నగదు, రూ. 30 లక్షలు విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసులు సాధారణ తనిఖీల్లో ఈ ఘటన వెలుగు చూసిందని నరసరావుపేట రైల్వే ఎస్సై సుబ్బారావు తెలిపారు. నిందితులు దోసపాటి మోహనరావు, ఆనంద్‌ కుమార్‌ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని.. నగదు, బంగారాన్ని సీజ్‌ చేసినట్లు తెలిపారు.

➡️