ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడి పది మందికి గాయాలు

Feb 9,2024 15:00 #khammam, #road accident

ఖమ్మం : ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో తొమ్మిది మందికి స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. హైదరాబాద్‌ నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తఅటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️