బడ్జెట్‌ పూర్తిగా నిరాశపరిచింది: కవిత

Feb 10,2024 15:16 #MLC Kavitha, #press meet

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కీలక కమాండ్‌ చేశారు. శాసనమండలి మీడియా పాయింట్లు ఆమె మాట్లాడారు. ఓటమి అకౌంట్‌ పూర్తిగా నిరాశపరిచిందని చెప్పారు. పాత పేరులను మార్చి కొత్త పేర్లు పెడుతున్నారు అంతే అని అన్నారు. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడానికి బడ్జెట్‌ ప్రసంగం సరిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ ప్రసంగంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తేలిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రగతిగేర్చు మార్చే అంశాలు ఏవి కూడా బడ్జెట్లో లేవని అన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన ఎన్నో హామీలను బడ్జెట్స్‌ ప్రస్తావించలేదని కవిత అన్నారు. ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగాలుగా చూస్తామని అన్నారు కానీ బడ్జెట్‌ ప్రసంగంలో ఆ ప్రస్తావన లేదు అనే కవిత అన్నారు.

➡️