బాలాంత్రం లాకులు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Feb 11,2024 15:50 #Konaseema, #road accident

ప్రజాశక్తి రామచంద్రపురం(అంబేద్కర్ కోనసీమ) : లారీ , స్కూటీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని కే.గంగవరం మండలంలోని బాలాంత్రం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపినవ వివరాల ప్రకారం.. యానం నుండి స్కూటర్‌పై ద్రాక్షారామం వైపు వస్తున్న లక్ష్మీ నరసాపురం గ్రామానికి చెందిన పిల్లి ప్రసాద్‌ (35), అనపర్తి సావరానికి చెందిన కే జాన్‌ (30) బాలాంతరం లాకులు వద్ద ఎరువులు బస్తాలతో వస్తున్న లారీని బలంగా ఢీకొట్టారు. దీంతో యువకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ క్లీనర్‌ లారీ వదిలి పరారయ్యారు. అతివేగమే ప్రమాదానికి కారణమని, యువకులు మద్యం సేవించి బండి నడిపినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతి చెందిన యువకుల వద్ద కొన్ని మద్యం బాటిల్లు బీరు బాటిళ్లు సంఘటన స్థలంలో పడి ఉన్నాయన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కే గంగవరం ఎస్‌ఐ జానీ భాష తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

➡️