మల్లన్న ప్రసాదంలో మాంసపు ముక్క – ఆలయ అధికారులకు ఫిర్యాదు

Feb 10,2024 08:07 #srisailam

ప్రజాశక్తి – శ్రీశైలం: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం మల్లన్న ప్రసాదంలో మాంసపు ముక్క వచ్చినట్లు దేవస్థానం అధికారులకు యాత్రికుడు హరీష్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. హైదరాబాదుకు చెందిన హరీష్‌ రెడ్డి శుక్రవారం శ్రీశైలం క్షేత్రానికి వచ్చారు. స్వామి, అమ్మ వార్లను దర్శించుకున్న అనంతరం ప్రసాదాలను కొనుగోలు చేశారు. బ్రహ్మానందరాయ గోపురం దగ్గర పంపిణీ చేసిన పులిహోర ప్రసాదంలో మాంసపు ముక్కను యాత్రికుడు గుర్తించారు. వెంటనే దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యంపై యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులిహోర ప్రసాదంలో దొరికినది మాంసపు ముక్క కాదని నిరూపించేందుకు దేవస్థానం అధికారులు ప్రయత్నిస్తునట్లు సమాచారం.

➡️