అధైర్యపడకండి.. అండగా ఉంటాం- టిడిపి కుటుంబ సభ్యులతో భువనేశ్వరి

Feb 14,2024 08:05 #Nara Bhuvaneshwari, #paramarsa

ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్‌ :టిడిపి కుటుంబ సభ్యులు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, మీ కష్టాల్లో పార్టీ అండగా ఉంటుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబసభ్యులను మంగళవారం ఆమె పరామర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయం చెక్కులను అందించారు. పుట్టపర్తి మండలం నిడిమామిడి పంచాయతీ గాజులపల్లి గ్రామంలో టిడిపి కార్యకర్త మునిమడుగు బావయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రూ.మూడు లక్షల ఆర్థిక సాయం చెక్కును అందించారు. అనంతరం ఓబుళదేవరచెరువు, తనకల్లు మండలాల్లో పలు కుటుంబాలను పరామర్శించారు. ఆమె వెంట మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, మాజీ ఎంపీ నిమ్మల కిష్ణప్ప, ఎమ్మెల్సీ అనురాధ, మాజీ ఎమ్మెల్యేలు బికె.పార్థసారధి, కందికుంట వెంకటప్రసాద్‌, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, సామకోటి ఆదినారాయణ తదితరులు ఉన్నారు.

➡️