మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి : మంత్రి సీతక్క

Feb 11,2024 15:30 #Minister Seethakka, #speech

ములుగు : మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. యాత్రికులు పెద్ద ఎత్తున తరలి వెచ్చే అవకాశం ఉన్నందున యాత్రికులకు అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని పంచాయతీ రాజ్‌, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ వన దేవతలను దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం కల్పిస్తుంద్నారు. ఈ నెల 23 న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, అదే విధంగా గవర్నర్‌తో పాటు రాష్ట్రపతి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ కుంభమేళా..మేడారం మహా జాతరకు అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లు ఆమె వివరించారు. కాగా, ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరుగనున్నది.

➡️