రాబోయే ఎన్నికల్లో గెలిచేది టిడిపియే: నారా లోకేశ్‌

Nov 29,2023 16:30 #Nara Lokesh, #speech

ముమ్మిడివరం: రానున్న ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టిడిపి-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆయన మాట్లాడారు. ”మాది అక్రమ కేసులకు భయపడే కుటుంబం కాదు. నా పాదయాత్రను అడ్డుకోవడానికి వైసిపి నేతలు చాలా ప్రయత్నాలు చేశారు. పిల్ల సైకోలు నన్నేమీ చేయలేరు. ఏ అధికారులైతే జగన్‌ మాట విన్నారో.. వాళ్లంతా ఇప్పుడు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. చంద్రబాబు, పవన్‌ కలవకూడదని జగన్‌ విశ్వప్రయత్నాలు చేశారు. జైలులో చంద్రబాబును చూసి పవన్‌ కూడా బాధపడ్డారు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతూ మెమోలు ఇస్తున్నారు. మూడు నెలలు ఓపిక పట్టాలని వారిని కోరుతున్నా” అని లోకేశ్‌ అన్నారు.

➡️