రోడ్డు ప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే గన్‌మెన్‌ మృతి

Mar 4,2024 07:58 #bapatla, #road accident

ప్రజాశక్తి-బాపట్ల :రోడ్డుప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గన్‌మెన్‌ మృతి చెందారు. ఈ ఘటన బాపట్ల-పొన్నూరు మార్గమధ్యలో చుండూరుపల్లి వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. బాపట్ల పట్టణం, ఉప్పరపాలెంకు చెందిన గోపిరెడ్డి (30) 2018లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. ప్రస్తుతం మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం బైక్‌పై బాపట్ల బయలుదేరారు. చుండూరుపల్లి వద్ద లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్‌టిసి బస్సు, వెనుక వస్తున్న లారీ రెండూ బైక్‌ను ఢకొీన్నాయి. దీంతో గోపిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించి రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు.

➡️