లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ : సిపిఎం

  •  భువనగిరి పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థిగా జహంగీర్‌ పోటీ

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ తమ తమ అభ్యర్ధులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీపై సిపిఎం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు సిపిఎం బుధవారం హైదరాబాద్‌లో అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సిపిఎం భువనగిరి అభ్యర్థిగా జహంగీర్‌ పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్‌. వీరయ్య వెల్లడించారు.

➡️