విద్యార్థుల ఘర్షణ.. గుండు గీయించిన కాలేజీ యాజమాన్యం

Nov 29,2023 11:27 #nandyala

ప్రజాశక్తి-నంద్యాల : కాలేజీ యాజమాన్యమే విద్యార్థులకు శిరోముండనం చేసి అవమానించిన అమానుష ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో వెలుగుచూసింది.  వివరాల్లోకి వెళితే… నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. గత సోమవారం రాత్రి జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య  మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.   గొడవలో పలువురు విద్యార్థులకు స్పల్ప గాయాలపాలయ్యారయి.  అయితే ఈ విద్యార్థుల గొడవ గురించి తెలిసి కాలేజీ సిబ్బంది  విద్యార్థులపై కర్రలతో దాడిచేసారు. అంతటితో ఆగకుండా ఆరుగురు విద్యార్థులకు శిరోముండనం (గుండు కొట్టి) చేసి అవమానించారు. కాలేజీ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

➡️