సాగర్‌ డ్యామ్‌ను పరిశీలించిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సభ్యులు

Feb 13,2024 16:15 #Nagarjuna Sagar dam, #pariseelana

హైదరాబాద్‌ : కేంద్ర జల సంఘం కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్‌ను నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సభ్యులు, ఏపీ, తెలంగాణ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ 13,14,15 తేదీల్లో డ్యామ్‌ పరిశీలనలో భాగంగా సందర్శించారు.జనవరి 9న కేంద్ర జలశక్తి కార్యదర్శి నేతృత్వంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో భాగంగా జలాశయాన్ని 13 మంది సభ్యుల బఅందం పరిశీలించింది. అంతకు ముందు నాగార్జునసాగర్‌ డ్యాంకు చేరుకున్న బృందానికి నీటిపారుదల శాఖ అధికారులు స్వాగతం పలికారు.

➡️