సార్వత్రిక ఎన్నికలపై ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్‌..

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా నవీకరణకు జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ జరగనుంది. రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా సమీక్షించనున్నారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం, పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, కనీస వసతుల కల్పనపై ముఖేష్‌ కుమార్‌ మీనా చర్చించనున్నారు.అధికారులు, సిబ్బంది నియామకం, ఎన్నికల అధికారులకు, సిబ్బందికి శిక్షణ, జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక పైనా ముఖేష్‌ కుమార్‌ మీనా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ప్రాంతాల వారీగా పోలింగ్‌ స్టేషన్‌లో మ్యాపింగ్‌, అక్రమ నగదు స్వాధీనం, వివిధ వర్గాల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారం పైనా చర్చ జరగనుంది. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎమ్‌.ఎన్‌. హరెందిర ప్రసాద్‌ హజరు కానున్నారు.

➡️