హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా ఆయన హైదరాబాద్ నుంచి షాద్ నగర్ వరకు ఆర్టీసీ బస్సులో ఆకస్మికంగా ప్రయాణించారు. బస్సులో ప్రయణిస్తున్న ప్రయాణికులతో ముచ్చటించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందుతున్న ఉచిత ప్రయాణం.. ప్రయాణం వల్ల ఆదా అవుతున్న డబ్బులు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పలు సమస్యలు మంత్రి దఅష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే మరో వెయ్యి కొత్త బస్సులు వస్తున్నాయని ఎవరికి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. మంత్రి ఆసాంతం నిలబడే ప్రయాణించడం విశేషం. మంత్రి వెంట దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా ఉన్నారు.
